![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద శ్రీముఖి, రోహిణి పెళ్లి ఎప్పుడు అనేది ఎవరికీ తెలీదు. ఏ షోలో ఐనా కానీ వీళ్ళ పెళ్లి విషయం ఒక హాట్ టాపిక్ గా ఉంటుంది. ఇక రీసెంట్ గా ప్రసారమైన ఆదివారం విత్ స్టార్ మా పరివారం 200 ఎపిసోడ్ షో ఫుల్ జోష్ తో సాగింది. ఇందులో రోహిణి పెళ్లి విషయం హైలైట్ గా నిలిచింది. అలాగే తన కోరికను చెప్పి స్టిక్ ని విరగ్గొట్టేసింది. త్వరలో పెళ్లి కూడా ఐపోతుందంటూ శ్రీముఖి చెప్పింది. ఐతే రోహిణి ఇంతకు ఎం చెప్పింది ఎవరెవరు ఎం ఎం జోక్స్ పేల్చారో చూద్దాం.
"నేను చాలాచాలా సార్లు చెప్పాను ఎవరూ సీరియస్ గా తీసుకోవట్లేదు. నేను జెన్యూన్ గా చెప్తున్నాను. నాకు బాలు మీద చిన్న ఇది ఉంది " అనేసరికి శ్రీముఖి కళ్ళు పెద్దవి చూసి రోహిణి వైపు చూసింది. కానీ రోహిణి భయపడకుండా తన మనసులో మాట చెప్పింది. "నెక్స్ట్ టైం నుంచి శ్రీముఖిని వదిలేసి నా వెనకే నా కొంగు పట్టుకుని తిరగాలని " అంది రోహిణి. "అమ్మా నీ వెనక తిరిగినా నీకు కనపడదు కదా " అని ఇమ్మానుయేల్ రోహిణి పరువు తీసేసాడు. లాస్ట్ ఇయర్ వినాయక చవితికి శ్రీముఖికి ఒక చీర నేసి ఇచ్చాడు బాలు. నెక్స్ట్ వినాయక చవితి వస్తోంది. ఆ టైంకి నాకు చీర ఇవ్వాలి. అది కట్టుకుని నేను ఆయనతో పెళ్లి పీటల మీద కూర్చోవాలి. అలా ఆయన నాకు గిఫ్ట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నా" అంటూ స్టిక్ విరగ్గొట్టింది రోహిణి. తర్వాత రోహిణికి గిఫ్ట్ గా శ్రీముఖి ఒక రోహిణి పెళ్లి కార్డుని రోహిణికి గిఫ్ట్ గా ఇచ్చింది. "ఎవరైనా పెళ్లి ఉన్నప్పుడు ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ వేరే వాళ్లకు ఇస్తారు. కానీ ఫస్ట్ మా ఆదివారం పరివారం నుంచి మా రోహిణి వెడ్డింగ్ ఇన్విటేషన్ ని రోహిణికే ఇస్తున్నాం " అని అనౌన్స్ చేసింది.
రోహిణి కూడా ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ ని అందరికీ చూపించింది ఐతే అందులో పెళ్లి కొడుకు పేరు లేదు. హరి ఆ విషయం అడిగేసరికి పెళ్లి కొడుకు ఇంకెవరు బాలు అని చెప్పింది. శ్రీముఖి మీకు నచ్చిన పేరు రాసుకోండి అనేసరికి "విష్ణు " అని రాసుకుంది రోహిణి. రోహిణి వెడ్స్ విష్ణు అని శ్రీముఖి అనౌన్స్ చేసింది. ఇక అవినాష్ వచ్చి "అసలు నీకు సెన్స్ ఉందా. ఇప్పటివరకు బాలు అన్నావ్ ఇప్పుడు విష్ణు అంటున్నావ్ ఇప్పుడే రెండు పేర్లు మార్చావ్ " అన్నాడు. ఇక దీపికా మధ్యలో వచ్చి "రోహిణికి విష్ణు శ్రీముఖికి బాలు " అంది. "ఆయన ఒరిజినల్ పేరును నా ఇంటి పేరుగా మార్చుకుని రాసుకుందామని రాసాను. చాల త్వరలో రోహిణి విష్ణు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. లంచ్ , డేట్ అవన్నీ పెట్టాను ఇక్కడే " అని చెప్పింది. "లంచ్ మొత్తం నువ్వే తింటావా మాకు ఉంచుతావా " అన్నాడు. "నిజంగా నీ పెళ్లి జరగాలని ఇలాంటిది చేస్తే మ్యానిఫెస్టేషన్ అని అంటారు. ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్రింట్ అయ్యిందంటే పెళ్లి ఘడియలు దగ్గర పడ్డాయని అర్ధం. చీర నేస్తున్నారు పెళ్లి జరుగుతుందా లేదా చూసేద్దాం " అని చెప్పింది శ్రీముఖి. ఇదంతా చూస్తున్న బాలు తెగ ఖుషీ ఐపోయాడు. ఇక రోహిణి ఐతే పెళ్లి కార్డు పట్టుకుని తెగ సిగ్గు పడిపోతూ థాంక్యూ అని చెప్పింది.
![]() |
![]() |